ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్ డిమాండ్.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 08(నమస్తే న్యూస్).
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మరిపెడ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో శవయాత్ర నిర్వహించారు.పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్ అధ్యక్షతన మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ ఎదురుగా జాతీయ రహదారిపై ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.తాతా మధు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పానుగోతు రాంలాల్ మాట్లాడుతూ,శాసనసభ స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తగదన్నారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని,లేనిపక్షంలో ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలు తీసుకుని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధ పదవులకు గౌరవం ఇవ్వాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

