- అవగాహనతో ముందుకు వెళ్ళండి
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 08(నమస్తే న్యూస్).
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ లో బాలికల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా హెచ్‌పీవీ(ఎచ్ పి వి)వ్యాక్సిన్‌పై ప్రత్యేక అవగాహన సదస్సును ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు నందిగామ జనార్ధనా చారి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జనార్ధనా చారి మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ,మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సర్వైకల్ క్యాన్సర్)బారిన పడకుండా ఉండటానికి కౌమార దశలోనే హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత కీలకమని తెలిపారు.14,15 సంవత్సరాల బాలికలకు ఈ టీకా ఇవ్వడం ద్వారా శరీరంలో బలమైన రోగనిరోధక శక్తి ఏర్పడి భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్ ముప్పును నివారించవచ్చని వివరించారు.టీకా పూర్తిగా సురక్షితమైనదని,ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని విద్యార్థినులకు,తల్లిదండ్రులకు సూచించారు.బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది కావేటి మంగమ్మ,ఎస్.వి.ఎస్ ఆచార్యులు,నాగమణి,అనసూర్య లు మరియు మహిళా ఉపాధ్యాయులు స్వప్న, శౌరి,జహేదా బేగం,అనిత,సుధ విద్యార్థినులు పాల్గొన్నారు.

