మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని విలేకరుల సమావేశంలో ఈరోజు బయ్యారం మండలం కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు నందిపాటి భవాని మాట్లాడుతూ….
తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
స్పీకర్ పదవి ఏ ఒక్క పార్టీకి, వ్యక్తికి సంబంధించినది కాదని.. అది శాసనసభ గౌరవానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని బవాణి పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనన్నారు.
రాజకీయంగా విభేదాలు ఉండొచ్చని.. కానీ రాజ్యాంగబద్ధమైన పదవుల గౌరవాన్ని కించపరిచేలా వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.
ఒక గౌరవ ప్రధమైన పదవిలో ఉండి ఒక దళిత సామాజిక వర్గం నాయకులు ఒక స్పీకర్ గా ఉంటే ఇంత అగౌరవంగా మాట్లాడం సిగ్గుచేటు.
“స్పీకర్‌ను అవమానించడం అంటే శాసనసభ గౌరవాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే అన్నారు,
తాతా మధు తన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేశారు.

