బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును తక్షణమే భర్తరఫ్ చేయాలి
అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షులు ఏపూరి రమణయ్య డిమాండ్
నమేస్తే న్యూస్ డోర్నకల్ ఆగష్టు 08
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షులు ఏపూరి రమణయ్య అన్నారు.
డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని గాంధీ కూడలిలో మంగళవారం నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవికి ఎంతో గౌరవం, ప్రతిష్ఠ ఉన్నాయని, ఆ పదవిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని రమణయ్య అన్నారు. తాతా మధు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. తాతా మధును బీఆర్ఎస్ పార్టీ తక్షణమే ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరఫ్ చేయాలని, లేనిపక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని రమణయ్య హెచ్చరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ కొండేటి రాజకుమారి హరినాథ్ బాబు, అంబేద్కర్ సేవా సంఘం నాయకులు బిఆర్ వీరస్వామి, పుట్ట వెంకటేశ్వర్లు,గారే రమేష్, ఏపూరి కృష్ణ, ప్రవీణ్ బాబు,ప్రశాంత్, మేకల రామారావు,గాజుల వేణు, అశోక్,దోమల లక్ష్మణ్, నర్సింగ్, అంబేద్కర్ సేవా సంఘం సభ్యులు, నాయకులు, మహిళలు ఉన్నారు

