- ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా..
- బిడ్డ జాగ్రత్త.. వదిలిపెట్టేది లేదు
- పదవులు శాశ్వతం కాదు.. ప్రజా శ్రేయస్సు ప్రధానం
- దిష్టిబొమ్మ దహనానికి యత్నం
- చెలరేగిన కాంగ్రెస్ శ్రేణులు
నమేస్తే న్యూస్ ,డోర్నకల్ ఆగష్టు 08 దళిత నేత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన దొరల అహంకార పూరిత అనుచిత వ్యాఖ్యలపై డోర్నకల్ కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. తాత మధు బానిసత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. దళిత నాయకుడిని అవమానించడం హేయమైన చర్య అని మండిపడుతూ తాత మధును ఎమ్మెల్సీ పదవి నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.గాంధీ బొమ్మ కూడలిలో తాత మధు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర నెట్టింవేతలు వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ముఖ్య నేతలు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ గుండాలారా ఖబడ్దార్.. ప్రజాస్వామ్య తెలంగాణలో మీ దొరతనం అహంకారపూరిత వ్యాఖ్యలు సాగవు అని ఘాటుగా హెచ్చరించారు. దళితులపై కక్షగట్టినట్లు మాట్లాడుతున్న తాత మధుపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుంటే గ్రామాల్లో బిఆర్ఎస్ నేతలను తిరగనివ్వమని హెచ్చరించారు. పుర చైర్ పర్సన్ కొండేటి రాజకుమారి హరినాథ్,వైస్ చైర్ పర్సన్ మాదా లావణ్య శ్రీనివాస్, కౌన్సిలర్లు సువర్ణ హరికృష్ణ, గారే రమేష్, నవీన్, హేమలత,ప్రమీల,మండల మహిళా నాయకురాలు కళావతి,నాయకులు సుమేర్ జైన్,శీలం శ్రీనివాస్, ఖాదర్ బాబా, ఏపూరి రమణయ్య, అంగోత్ వెంకన్న, మధు, మున్నా,తదితరులు ఉన్నారు.

