టి ఆర్ పి పార్టీ రామన్నపేట మండల అధ్యక్షులు కళ్లెం ఉపేందర్
రామన్నపేట సెప్టెంబర్ 8( నమస్తే న్యూస్)
రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పీఠాన్ని అవమానించడం అంటే తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించడమే, ముఖ్యంగా ఒక దళిత బిడ్డ స్పీకర్ స్థానంలో ఉండటాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి జుగుప్సాకరమైన భాషను ఉపయోగించడం దళిత సమాజాన్నే అవమానించడమే,స్పీకర్ పై నోరు పారేసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధును, నవీన్ రెడ్డిని శాసన మండలి నుండి తక్షణమే బహిష్కరించాలి ,సస్పెండ్ చేయాలి,దళితుడైన స్పీకర్ ను అవమానించినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి,రాజ్యాధికారం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పుట్టిన మా పార్టీ, ఇలాంటి అరాచక శక్తులకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటుంది, స్పీకర్ కి మా పార్టీ నుండి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము.

