డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 08 (నమస్తే న్యూస్).
మరిపెడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడిగా మద్ది వినోద్ కుమార్ (ధరావతండ పంచాయతీ కార్యదర్శి)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ప్రధాన కార్యదర్శిగా గోపీచంద్ (రాంపురం పంచాయతీ కార్యదర్శి),కోశాధికారిగా విప్లవ (అమృనాయక్ తండ పంచాయతీ కార్యదర్శి)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పంచాయతీ కార్యదర్శులు అభినందనలు తెలిపారు.మండలంలోని పంచాయతీల అభివృద్ధి,పరిపాలనను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు సమన్వయంతో పనిచేస్తామని వారు తెలిపారు.ఈ సమావేశంలో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

