రుద్ర టీ హబ్ నూతన ప్రారంభోత్సవంలో పాల్గొన్న జగ్గుతండా గ్రామ సర్పంచ్ బొల్లి జయంతి వెంకటకృష్ణ.
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్ సెంటర్: బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని జగ్గుతండా గ్రామపంచాయతీ పరిధిలో నూతన టీ, కాఫి షాప్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్ బొల్లి జయంతి వెంకటకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంలో బుల్లి జయంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ, ప్రోప్రేటర్ అడిదల ఆశదేవితో కలిసి పూజ కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో దేవుని పూజించి, ఆ దేవుణ్ణి ఆశీస్సులతో ఆశదేవి గారి “టీ హబ్” షాప్ మంచిగా సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు ఉప సర్పంచ్ గుంజ వీరస్వామి, వార్డు సభ్యులు కండ్రాతి యాకేష్, మక్కల దుర్గారావు, దేరంగుల సమ్మయ్య, షేక్ సైదులు, గుర్రం సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటన గ్రామ ప్రజలకు ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చింది.

