సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి డిమాండ్.
మహబూబాబాద్ టౌన్. కనీస వేతన సలహా బోర్డు నుంచి సిఐటియును మినహాయించడం దుర్మార్గమని వెంటనే చేర్చుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి డిమాండ్ చేశారు. ఈరోజు సిఐటి యు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా వివేకానంద సెంటర్ లో ప్లే కార్డ్స్ తో సిఐటియు పట్టణ కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా సమ్మెట రాజమౌళి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలకు మరో నిదర్శనం కేంద్ర కనీస వేతన సలహా బోర్డు పునర్వ వ్యస్తీకరణలో ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలైన సిఐటియు ఏఐటీయూసీ ఐఎన్ టియుసి ప్రాతినిధ్యం నిరాకరించడమేనని విమర్శించారు. కార్మికుల కనీస వేతనాలు జీవన ప్రమాణాలు ఉపాధి పరిస్థితిలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై నిర్ణయాలు తీసుకునే కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయూ ఏఐటీయూసీ ఐఎన్ టియుసి
వంటి ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అప్రజాస్వామికం కక్షపూరితమైన చర్యని దుయ్యబట్టారు. లేబర్ కోడులా పేరుతో కార్మికుల హక్కులను హరించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కనీస వేతనాల నిర్ణయం ప్రక్రియలో కూడా కార్మిక సంఘాల గొంతును నొక్కి వేయడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు ఇంధన ధరలు విద్యుత్ చార్జీలు వైద్యం విద్య ఇల్లు రవాణా ఖర్చులు నిరంతరం పెరుగుతున్నప్పటికీ కార్మికుల నిజమైన ఆదాయాలు మాత్రం పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మూడు సంఘాలను వేతన సలహా బోర్డులో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. లేనివేడలా మోడీ. ప్రభుత్వా నికి పతనం తప్పదనీ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాక చందు. ఎర్రశ్రీను వాస్. ఫుల్ గుజ్జు వెంకన్న. వాసం దుర్గారావు. నరసింహారావు. వంశి .ఐలయ్య. భద్రయ్య.వెంకటేష్. రాజు. జంపాల రామ్మూర్తి. ఆర్టీసీ ముత్తయ్య. ఆజాద్. తదితరులు పాల్గొన్నారు

