మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఎం.ఎల్లమ్మ.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 07(నమస్తే న్యూస్):
మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టులోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని ఎం.ఎల్లమ్మ అన్నారు.సోమవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని హౌసింగ్ బోర్డు ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడి టీచర్ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకున్న మహిళ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లా అధికారుల ఆదేశానుసారం, ప్రభుత్వ నియమ, నిబంధనలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఎలాంటి పైరవీలకు తావు లేదన్నారు.ఆయా పోస్టుల రిజర్వేషన్ ప్రకారము మెజార్టీ అభ్యర్థులకు మాత్రమే పోస్టులను కేటాయిస్తున్నామన్నారు. మహిళా అభ్యర్థులు దళారులను నమ్మొద్దన్నారు. ఎలాంటి రాజకీయ నాయకులు, డబ్బు, ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా! మెరిట్ అభ్యర్థులను మాత్రమే! ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసిన మహిళా అభ్యర్థులు సకాలంలో త్వరితగతిన కార్యాలయాలకు చేరుకొని తమ సర్టిఫికెట్లను పరిశీలించుకోవాలని కోరారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలనలో ఏ సి డి పి ఓ రోజారాణి, సూపర్వైజర్లు ఉషారాణి, రాజ్యలక్ష్మి, మంగాదేవి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

