రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలపై ప్రజల అనుమానం.
కార్యాలయాల భద్రతకై లైటింగ్ ఏర్పాటు చేయాలి.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 07 (నమస్తే న్యూస్).
మరిపెడ పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం,వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో మద్యం,బీరు సీసాలు కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో ఇలాంటి సీసాలు దర్శనమివ్వడంతో స్థానిక ప్రజలు ఆందోళన,అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పగటిపూట ప్రజల సేవల కోసం ఉపయోగించే కార్యాలయాల్లో రాత్రి వేళల్లో ఏం జరుగుతోందనే ప్రశ్న తలెత్తుతోందని స్థానికులు అంటున్నారు.రాత్రివేళల్లో కార్యాలయాల ఆవరణలోకి అనధికారికంగా ఎవరైనా ప్రవేశించి మద్యం సేవిస్తున్నారా,లేక ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కార్యాలయాల చుట్టూ సరైన భద్రత లేకపోవడం,రాత్రిపూట లైటింగ్ లేకపోవడంతో ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఏర్పడుతోందని ప్రజలు చెబుతున్నారు.ప్రభుత్వ కార్యాలయాల పవిత్రత,భద్రత దెబ్బతినకుండా ఉండేందుకు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.కార్యాలయాల ఆవరణలోకి రాత్రివేళల్లో ఎవరు వస్తున్నారో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,ప్రభుత్వ కార్యాలయాల భద్రతకు సెక్యూరిటీ గార్థులను నియమించాలని,కార్యాలయ ఆవరణలో లైట్లు ఏర్పాటు చేయాలని,అలాగే కార్యాలయం ఆవరణలో చెత్త శుభ్రం చేపియ్యాలని,పాములు,తేల్లు కార్యాలయాల్లోకి వచ్చిన సందర్భలు జరుగుతున్నవి కాబట్టి కార్యాలయ ఆవరణలో చెత్తను శుబ్రం చేపియ్యాలని భద్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


