కోటియా తండాలో భూమిపూజ చేసిన సర్పంచ్ బాలాజీ నాయక్.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 07 (నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని కోటియా తండా గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం సర్పంచ్ తేజావత్ బాలాజీ నాయక్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం భూమిని దానంగా ఇవ్వడం గ్రామంలో అభినందనీయంగా మారింది.తన తల్లి తేజావత్ పోరీ మాజీ సర్పంచ్,తండ్రి జింత్ర నాయక్ జ్ఞాపకార్థంగా గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం సొంత స్థలాన్ని దాతగా అందజేశారు.అట్టి భూమిలో గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి సర్పంచ్ తేజావత్ బాలాజీ నాయక్ సోమవారం భూమి పూజ నిర్వహించారు.గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారంగా తల్లిదండ్రుల పేరు చిరస్థాయిగా ఉండేలా ఈ భూదానం చేశానని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు.త్వరలోనే భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ గ్రామ నాయకులు తేజావత్ సోమన్న,సిరి,చరణ్ రాజ్, సురేష్, బీమా, రమేష్, శివసింగ్, శివ, మధు, రవి, శ్రీరామ్, వీరన్న, శీను,రామన్న,సీతారాం,నరేష్, స్వామి,బాల,సోమన్న,వెంకన్న,రాము తదితరులు పాల్గొన్నారు…


