డ్రైవర్ల సమస్యలకు మద్దతుగా నిరసన.. ప్రత్యేక ఆకర్షణగా ఆటో ప్రయాణం
కురవి, సెప్టెంబర్ 7 (నమస్తే న్యూస్):
ఆటో డ్రైవర్ల సమస్యలకు మద్దతుగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా ఆటో నడిపి పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో నిర్వహించిన ఈ నిరసనలో ఆమె ఆటో స్టీరింగ్ చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా నిలవాలని, వారి జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.నిరసనలో భాగంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా ఆటో నడుపుతూ పాల్గొనడంతో కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై వారి తరఫున నిలబడి పోరాటం చేస్తామని నాయకులు పేర్కొన్నారు.ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

