సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జింకలగూడెం గ్రామాన్ని సందర్శించిన ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్…
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 6 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లోని జింకల గూడెం గ్రామాన్ని అనుకోకుండా సందర్శించిన ఆర్టిఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్ తన సహచర మిత్రుడు మరియు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు సీఎం డి చైర్మన్ సయ్యద్ ఇమామ్ ను మర్యాదపూర్వకంగా జింకలగూడెం గ్రామంలో కలిసినరు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ
ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కీలక పాత్ర పోషిస్తుందని ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్ అన్నారు. పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రజలు కూడా సమాచార హక్కు చట్టాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
తిరుమలాయపాలెం మండలం జింకలగూడెం గ్రామాన్ని ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడి, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, హక్కు కార్యక్రమాలు తదితర అంశాలపై ప్రజలకు ఉన్న హక్కులు, వాటి వివరాలను తెలుసుకునే విధానంపై అవగాహన కల్పించారు.
అవినీతిని అడ్డుకోవడంలో ఆర్టీఐ కీలకం….
ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే ప్రతి పని ప్రజలకు జవాబుదారీగా ఉండేలా సమాచార హక్కు చట్టం పనిచేస్తుందని కమిషనర్ తెలిపారు. అవినీతికి తావు లేకుండా ఆర్టీఐ చట్టాన్ని అమలు చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
“గ్రామాల్లో చిన్నపాటి అవినీతి జరిగినా, దాని గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరండి. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని పొందే హక్కు ఉంది. ప్రభుత్వం నుంచి మీకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూస్తాం” అని ఆయన అన్నారు.
ప్రతి పౌరుడి బాధ్యత
సమాచారం తెలుసుకోవడం కేవలం హక్కు మాత్రమే కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని పీవీ శ్రీనివాస్ అన్నారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు ఎంత నిధులు మంజూరయ్యాయి? పనులు ఎక్కడ జరుగుతున్నాయి? ఎంత ఖర్చు చేశారు? లబ్ధిదారుల ఎంపిక ఎలా జరిగింది? వంటి వివరాలను ప్రజలు ఆర్టీఐ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
ప్రజలు తమ హక్కులను తెలుసుకుని ప్రశ్నించినప్పుడే ప్రభుత్వ పాలన మరింత పారదర్శకంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
“ప్రశ్నించండి… సమాచారం తెలుసుకోండి”
పల్లె ప్రజలు కూడా ఆర్టీఐని ఒక ప్రజాస్వామ్య ఆయుధంగా ఉపయోగించుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు. తమ గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ నిధులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై అనుమానాలు ఉంటే చట్టబద్ధంగా సమాచారం కోరాలని సూచించారు.
“సమాచార హక్కు ప్రతి ఒక్కరి హక్కు. ప్రతి పౌరుడు దానిని వినియోగించుకోవాలి. ప్రశ్నించే పౌరుడే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాడు” అనే సందేశాన్ని ఆయన గ్రామ ప్రజలకు అందించారు.
జింకలగూడెం గ్రామంలో ఆర్టీఐ కమిషనర్ పర్యటనతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా సమాచార హక్కు చట్టంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే చర్చ మొదలైంది.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు సిఎండి చైర్మన్ సయ్యద్ ఇమామ్, మందడి వీరారెడ్డి తెలంగాణ జేఏసీ జిల్లా అధ్యక్షులు మందడి ఇజ్రాయిల్, పి సంజీవరెడ్డి, భాజ సత్యనారాయణ, నాగేందర్,గోల్ తండా సర్పంచ్ సుజాత _అనిల్ కుమార్, షేక్ మోహినుద్దీన్, ఎస్ డి అజీమ్, ఎస్ డి ఇమామ్, ఎస్ డి సైదా, ఎస్కే కరీం, ఎస్.కె మదర్, ఎస్కే లాల్, ఎస్ డి ఉస్సేన్, తదితరులు పాల్గొన్నారు

