అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే విమర్శలు
మండల కాంగ్రెస్ నాయకులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 6 (నమస్తే న్యూస్ )
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండల కాంగ్రెస్ నాయకులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టించేలా గ్రామాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నాయకులు ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న ప్రజలే వాస్తవాలను గుర్తిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టి వారికి తగిన గుణపాఠం చెబుతారని కట్కూరి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

