నర్సింహులపేట, సెప్టెంబర్ 6 (నమస్తే న్యూస్)
నర్సింహులపేట మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాత్రికేయులంతా ఏకాభిప్రాయంతో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అధ్యక్షులుగా సలుగు నాగన్న, ప్రధాన కార్యదర్శిగా చెలిమల్ల గణేష్ ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గం:అధ్యక్షులు – సలుగు నాగన్న,ప్రధాన కార్యదర్శి – చెలిమల్ల గణేష్
,సహాయ కార్యదర్శి – భుక్య రమేష్,ఉపాధ్యక్షులు – నిమ్మల నరేష్, బత్తిని సతీష్,కోశాధికారి – ఎర్ర వెంకట్రాం నర్సయ్య గౌరవ అధ్యక్షులు – గడ్డి యాకన్నగౌరవ సలహాదారు – చౌడారపు శ్రీనివాసు డాడుల నియంత్రణ కమిటీ: మందుల యాకూబ్, బేతమల్ల అశోక్, ఐలి సాయి కుమార్.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పాత్రికేయుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఐక్యతతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, ప్రజలకు–ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని కొనసాగిస్తామని తెలిపారు.నూతన కార్యవర్గం ఎన్నిక పట్ల పలువురు పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల నాయకులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.


