రామన్నపేట సెప్టెంబర్ 6( నమస్తే న్యూస్ )
శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని గ్రామ సర్పంచ్ కునూరు సాయి కుమార్ గౌడ్ మనస్ఫూర్తిగా కోరుకుంటు మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు, ఈ సందర్భంగా బోగారం గ్రామానికి చెందిన గ్రామస్థులు ముత్యాలమ్మ తల్లికి బోనం సమర్పించి, అమ్మవారి కృపాకటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ పవిత్రమైన బోనాల పండుగ డప్పు చప్పుళ్లతో ఆటపాటలతో కోలాహలంగా మహిళలు బోనాల పండుగ జరుపుకున్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, గ్రామ మాజీ సర్పంచ్ అంతటి పద్మా రమేష్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్, యాదవ సంఘం అధ్యక్షులు మెట్టు అంజయ్యయాదవ్, అడ్వకేట్ కందగట్ల శ్రీనివాస్, అడ్వకేట్ కునూరు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మేడి రామలింగం, ఉప సర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, వార్డు మెంబర్లు, గోగు ప్రమీల రమేష్ యాదవ్, మేడి అంజనేయులు, నేరటి మానస సురేష్ యాదవ్, గ్రామ పెద్దలు నేరటి మల్లేష్ యాదవ్,నేరటి రమేష్ యాదవ్, పబ్బు ధనుంజయ గౌడ్, గోషిక వెంకటేశ్వర్లు, రాపోలు గణేష్,చెరుకు నరేష్ గౌడ్ కునూరు మహేష్ గౌడ్, మేడి కృష్ణ, కునూరు రామాంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

