నివాళులు అర్పించిన టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాస్…

మరిపెడ మండల సీనియర్ జర్నలిస్ట్, పోతుల గోవర్ధన్ తల్లి పోతుల కాంతమ్మ (84) అనారోగ్య కారణాలతో ఆదివారం మరిపెడలో మరణించారు.విషయం తెలుసుకున్న టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గంధసిరి రవి స్థానిక జర్నలిస్ట్ లతో కలిసి గోవర్ధన్ ను, పరామర్శించి కాంతమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు..అనంతరం వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో మరిపెడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మూడు శ్రీకుమార్, ఉపాధ్యక్షులు బానోత్ ప్రవీణ్ నాయక్, సీనియర్ జర్నలిస్ట్ రేఖ అశోక్, కారంపురి వెంకటేశ్వర్లు, బోడ శ్రీనివాస్, మూడు విజయకుమార్, ఉప్పల రమేష్, తదితరులు ఉన్నారు..

