తిరుమలాయపాలెం సెప్టెంబర్ 6 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లోని జింకలగూడెం గ్రామాన్ని సందర్శించిన ఆర్టీఐ కమిషనర్ పి.వి. శ్రీనివాస్‌ను తెలంగాణ జేఏసీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మందడి ఇజ్రాయిల్‌తో పాటు తిరుమలాయపాలెం మండల జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కమిషనర్ పి.వి. శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. తిరుమలయపాలెం మండలంలోని జింకల గూడెం గ్రామంలో సహచర మిత్రులు సయ్యద్ ఇమామ్ ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిసి నా సందర్భంలో ఆర్టిఐ కమిషనర్‌ను సత్కరించడం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో సమాచార హక్కు చట్టంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, అవినీతికి అడ్డుకట్ట వేయడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్ మందడి ఇజ్రాయిల్ టి యు డబ్ల్యూ జే ఐజేయు జిల్లా నాయకులు పప్పల శ్రీనివాసరావు గాదరిబాబు బి ఆర్ కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఎలిమల్ల శ్రీనివాసరావు కూరపాటి విజయ్ గాదరి వెంకన్న దామల్ల భాస్కర్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

