పోతుల కాంతమ్మ మృతికి ప్రగాఢ సంతాపం.
సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 06(నమస్తే న్యూస్).
నవతెలంగాణ సీనియర్ జర్నలిస్టు పోతుల గోవర్ధన్ తల్లి పోతుల కాంతమ్మ ఈరోజు మృతి చెందడం పట్ల సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి.అబ్దుల్ రషీద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పోతుల కాంతమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి,సంతాపం తెలిపారు.ఈ విషాద సమయంలో సీనియర్ జర్నలిస్టు పోతుల గోవర్ధన్ కి,వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కమలాకర్ పాల్గొని,పోతుల కాంతమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

