పరామర్శించి నివాళులర్పించిన నాయకులు.
మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్,మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 06(నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన వుర్లుగొండ సురేష్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా శనివారం ఉదయం అకాల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు మాజీ మంత్రి ఢీ ఎస్.రెడ్యానాయక్,మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు.పరామర్షలో సీనియర్ నాయకులు రామడుగు అచ్యుత్ రావు,కలసాని దామోదర్ రెడ్డి ఎల్లంపేటకు చేరుకుని సురేష్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.వారి వెంట గండి మహేష్,గండి పరమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, గండి అంబరీష్, గండి పుల్లయ్య, వుర్లుగొండ మధు, గండి ఉపేందర్, వుర్లుగొండ సోమయ్య, వుర్లుగొండ రవి, గండి వెంకటేష్, గండి హరీష్ తదితరులు ఉన్నారు…


