సీసీ రోడ్డుపై వెహికల్స్ వెళ్తుంటే దిగబడుతున్న మైనం…
సీసీ రోడ్డు పగిలిన చోట సిమెంటుతో పూత…
రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పై సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలంటున్న వీధి ప్రజల డిమాండ్.
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామ పంచాయతీలోని కొమరం భీమ్ కాలనీ, ముత్యాలమ్మ గుడి దగ్గర పొలాలకు వెళ్లే వీధుల్లో సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది, వేసిన పది రోజులకే పగుళ్లు, బీట్లతో, ఒక సైడు వంగడంతో వీధిలోని ప్రజలు ఆగ్రహం ఆవేదన చెందుతున్నారు..ఈ సందర్భంగా ఆ వీధిలోని పద్మ , వట్టం శీను మాట్లాడుతూ… గత 14 సంవత్సరాల నుండి సిసి రోడ్డు కోసం ఎదురు చూశాము,మా వీధిలో వర్షాకాలంలో, మోకాళ్ళ లోతు బురదలో కాళ్లు దిగబడుతున్న అలాగే నడిచామని, బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళమని, పాఠశాలకు వెళ్లాలంటే నరకం అనుభవించాము, ఇప్పుడు మా వీధిలో సిసి రోడ్డు శాంక్షన్ అయ్యిందని తెలిసి చాలా సంతోషపడ్డాము, ఆ సంతోషం కొన్ని రోజులకు పరిమితం అవుతుందని ఊహించలేదని అన్నారు, నాసిరకమైన ఇసుక, సిమెంటు తక్కువ వాడి సి సి రోడ్డు వేయడం వల్ల పది రోజులకే సీసీ రోడ్లు మొత్తం పగుళ్ళు, బీట్లు, ఒక సైడు వంగిపోయిందని , ఆవేదన చెందారు, మరలా కొంతకాలానికి పాత రోజులు తిరిగి వస్తాయని ఆవేదన చెందారు.సిసి రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పగిలిన విషయం తెలుసుకొని ఉదయం సుమారు 4 గంటలకు సమయంలో పగిలిన సీసీ రోడ్డుపై సిమెంటుతో పూసుకుంటూ వెళ్లాడని ,సిసి .రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..



