ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 16(నమస్తే న్యూస్):
మరిపెడ పట్టణంలోని గడి ఆవరణలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉట్టికొట్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు.మాకుల దేవస్థానం పర్యవేక్షణలో,మరిపెడ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి,గంట్ల గౌతమ్ రెడ్డి,జాటోతు సురేష్, మెరుగు రాము,పానుగోతు రాములు,బోడ భాస్కర్ పాల్గొన్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ టౌన్ మాజీ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్,గంట్ల సుధాకర్ రెడ్డి,ముదిరెడ్డి బుచ్చిరెడ్డి,అలువాల ఉపేందర్ ప్రజాపతి, గుగులోత్ లచ్చిరాం,వెర్మరెడ్డి వెంకట్ రెడ్డి,కుడితి వెంకట్ రెడ్డి, దేవరశెట్టి కృష్ణమూర్తి,ఉమేష్, గుండగాని నరేష్,గంధసిరి రాములు, మదనయ్య, సోమన్న, వీరబాబు, ఏడెల్లి శివ,పవన్, శంకర్, యాదగిరి, ఆలయ అర్చకుడు నల్లాన్ చక్రవర్తుల లక్ష్మణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.



