సీఎం రేవంత్ రెడ్డి చే వర్చువల్ శంకుస్థాపన
స్థలధాత గంగుల రాజిరెడ్డికి
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం అభినందన
రామన్నపేట సెప్టెంబర్ 5(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గ్రామంలో రూ. 3 కోట్ల 62 లక్షల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసినట్లు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.
స్థలదాతకు అభినందనలు తెలిపిన గ్రామ ప్రజలు
ఈ సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని దానంగా ఇచ్చిన పల్లివాడ గ్రామానికి చెందిన గంగుల నర్సిరెడ్డి కుమారుడు గంగుల వెంకట రాజిరెడ్డిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.4 ఫీడర్లు వేలాది మందికి ప్రయోజనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సబ్ స్టేషన్ నుండి మునిపంపుల, దుబ్బాక, పల్లివాడ, కక్కిరేణి అనే 4 ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేయనున్నారు. దీని వల్ల 1546 వ్యవసాయ, 2400 గృహ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ అందనుంది. అంతేకాకుండా ఎన్నారం, ఇస్కిళ్ల సబ్ స్టేషన్లపై లోడ్ తగ్గి ఆ ప్రాంత వినియోగదారులకు కూడా మెరుగైన విద్యుత్ అందనుందని తెలిపారు.


