కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం
రామన్నపేట సెప్టెంబర్ 5(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి సురేష్, అకాడమిక్ డైరెక్టర్ జి మనీ పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో గురు బాధ్యత ఎంతో ముఖ్యమైనదని భావి భారత పౌరులు సభ్య సమాజంలో సరైన దారిలో నడవడానికి గురు బాధ్యత ముఖ్యమని అలాంటి బాధ్యతలను సమాజానికి తెలియజేసిన గొప్ప గురువు సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు, నేటి విద్యార్థిని విద్యార్థులకు మహనీయుల చరిత్రతో పాటు వారి త్యాగాలను తెలియాలని ఈ సందర్భంగా అన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

