తిరుమలాయపాలెం సెప్టెంబర్ 5 (నమస్తే న్యూస్ )తిరుమలాయపాలెం మండలం లోని బీరోలు మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎన్ హెచ్ సి పిడబ్ల్యుడి ఏపిఎం శారద , తిరుమలాయపాలెం మండల ఏపీఎం సత్యనారాయణ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీఎం సత్యనారాయణరాజు మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల పునారావస కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత అతని యొక్క విద్యార్థులు తన తోటి వారు అందరూ మీ యొక్క పుట్టినరోజును జరుపుతామని అనగా వారు నా పుట్టినరోజును భారతదేశంలోని ఉపాధ్యాయుల దినోత్సవం గా జరపాలని అతని యొక్క జయంతిని ఉపాధ్యాయ దినోత్సవం గా నామకరణం చేశారని, ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక మంచి విద్యార్థి ఉన్నట్లయితే దేశం బాగుపడుతుందని డాక్టర్ రాధాకృష్ణన్ గారు అన్నారని అంతటి మహనీయుల వేడుకను దివ్యాంగుల సమక్షంలో జరుపుకోవడం నాకు చాలా సంతోషకరమని అన్నారు మానసిక దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని విధాలుగా నా వంతు కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తానని ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నానని అన్నారు. ఆ తర్వాత ఎన్‌హెచ్‌సి పీడబ్ల్యుడి ఖమ్మం జిల్లా ఎపిఎం శారద మాట్లాడుతూ దివ్యాంగుల మానసిక పునరావస కేంద్రం కి ఫిజియోథెరపిస్టుని ఐడి స్పెషల్ ఎడ్యుకేషన్ స్పీచ్ థెరపీని నియమించి వారికి ఫిజియోథెరపీ చేయించడం మాటలు నేర్పడం మొదలగున యాక్టివిటీస్ చేయిస్తున్నామని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తల్లిదండ్రులు మానసిక దివ్యాంగ పునరావాస కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిసి ఎస్కే జమీల బేగం, ప్రొఫెషనల్, ఫిజియోథెరపిస్టు స్వాతి ఐడి స్పెషల్ ఎడ్యుకేషన్, టి లక్ష్మణరావు , స్పీచ్ తెరపిస్టు ఏ నాగేశ్వరరావు ఎంఎంఎస్ ఓబి అధ్యక్షులు షేక్ నస్రిన్ , శేఖర్ , నాగమ్మ నరసమ్మ దివ్యాంగులైన పిల్లలు వారి తల్లిదండ్రులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
