తిరుమలాయపాలెం సెప్టెంబర్ 5 (నమస్తే న్యూసఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు అందజేశారు.ఇంగ్లీష్ మీడియంలో మొదటి బహుమతిగా భవానీకి 489 మార్కులు, రెండో బహుమతిగా వల్లపు వినీలకు 484 మార్కులు రావడంతో నగదు బహుమతులు అందించారు. తెలుగు మీడియంలో మొదటి బహుమతి ధారావత్ కవిత, రెండో బహుమతి సయ్యద్ అబీద్‌కు లభించింది.తిరుమలాయపాలెం గ్రామవాసి, పాఠశాల పూర్వ విద్యార్థి, ఖమ్మం రూరల్ మండలంలోని ఎంపీపీఎస్ గుడిమళ్ల పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్‌టీఎఫ్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ధారావత్ రాములు తన తల్లిదండ్రులైన ధారావత్ గోలియా, జానకి జ్ఞాపకార్థం రూ.10,116ను అందజేశారు.ఈ సందర్భంగా ధారావత్ రాములు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

