టీజేఏసీ జిల్లా అధ్యక్షులు మందడి ఇజ్రాయిల్
తిరుమలాయపాలెం మండలం లోని సుబ్లేడ్ లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మెయిల్ ద్వారా టీజేఏసీ చైర్మన్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు లో బాసర ట్రిపుల్ఐటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్) తరహాలో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ( టీజేఏసీ ) ఖమ్మం జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించింది.తిరుమలాయపాలెం మండలం, పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సరైన విద్యాసంస్థలు అందుబాటులో లేవని టీజేఏసీ పేర్కొంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపింది.మండలంలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే స్థానిక విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందడంతో పాటు ఉపాధి, పరిశోధన, సాంకేతిక విద్యకు అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొంది. దీనివల్ల పరిసర గ్రామాల విద్యార్థులకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపింది.తిరుమలాయపాలెం మండలం లోని సుబ్లేటి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 149లో 65 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, బాసర IIIT తరహా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఈ భూమిని పరిశీలించాలని కోరింది. ప్రజల విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులతో చర్చించి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని టీజేఏసీ జిల్లా అధ్యక్షులు మందడి ఇజ్రాయిల్ కోరారు

