రామన్నపేట సెప్టెంబర్ 5(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన డాక్టర్ కూనూరు భాస్కర్ గౌడ్ ఈ రోజు కొడంగల్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకోవడం జరిగింది.విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రాణా, కళాశాల విద్యా కమీషనర్ శ్రీదేవసేన నుండి పురస్కారం అందుకున్నారు. డాక్టర్ భాస్కర్ గౌడ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని చారిత్రక సిటీ కళాశాలలో రాజనీతి శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఈ యొక్క అవార్డు పురస్కారం రావడం వల్ల బోగారం గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ మరియు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

