1997–98 బ్యాచ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
నర్సింహులపేట, సెప్టెంబర్ 5 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 1997–98 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అప్పట్లో తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించి, వారి సేవలను గుర్తు చేసుకుంటూ ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, తమ జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్రను కొనియాడారు.“నాడు మీరు బోధించిన పాఠాలే నేడు మా బంగారు భవిష్యత్తుకు బాటలు వేశాయి. మీ క్రమశిక్షణ, విలువలు, విద్యాబోధన మా జీవితాలకు ఎంతో ఉపయోగపడ్డాయి” అంటూ పూర్వ విద్యార్థులు తమ గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. కార్యక్రమం ఆద్యంతం గురు–శిష్యుల ఆత్మీయతకు ప్రతీకగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఎర్ర నరసయ్య,మంద వీరన్న, పద్మ ,మున్నా బేగం,దయాకర్, అనిల్, మహేష్, తదితరులు పాల్గొన్నారు



