మరిపెడ, సెప్టెంబర్ 5 (నమస్తే న్యూస్):
ప్రమాదవశాత్తు కాలు విరిగి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న మరిపెడ మున్సిపాలిటీ 11వ వార్డుకు చెందిన బాష్పంగు మల్లమ్మను మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు పరామర్శించారు.శనివారం మల్లమ్మ నివాసానికి వెళ్లిన నవీన్‌రావు.. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుతో పాటు ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. మల్లమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆమెకు ధైర్యం చెప్పారు.అవసరమైతే అన్ని విధాలా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనారోగ్యం లేదా ప్రమాద సమయంలో కార్యకర్తలకు అండగా ఉండటం తమ బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ గంట్ల సుజాత–మహిపాల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎడెల్లి పరశురాములు, పోస్ట్ ఎంకన్న, బాష్పంగు లక్ష్మయ్య, పుల్లూరు ఉమ, వెంకటేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

