ప్రజా సంక్షేమమే లక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెలతుంది.
నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్రునాయక్.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 05:(నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో శనివారం మండల కాంగ్రెస్ నాయకత్వంలో ప్రజాపాలన 1000 రోజుల విజయోత్సవ యాత్ర ఘనంగా జరిగింది.పట్టణంలోని ఖమ్మం,వరంగల్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ.సంక్షేమ ప్రజా పాలనే లక్ష్యంగా 1000 రోజుల పాలన-ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్.ఈ యాత్రలో ప్రభుత్వ విప్-డోర్నకల్ శాసనసభ్యుడు డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్,రాష్ట్ర పరిశీలకుడు అవీజ్ ఖాన్,జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం ఆరు(గ్యారంటీలు)హామీల అమలులో ముందుకు సాగుతోందని తెలిపారు.గత పాలకుల మాదిరిగా కాకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు:
మహాలక్ష్మి:మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం,500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ. గృహజ్యోతి: ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. రైతు భరోసా:
ప్రతి ఏటా రైతులకు ఎకరాకు 15 వేల రూపాయలు, రుణమాఫీ ద్వారా రైతులకు భరోసా కల్పించింది. ఇందిరమ్మ ఇండ్లు:ఇల్లు లేని నిరుపేదలకు అన్ని సౌకర్యాలతో ఇండ్ల నిర్మాణం.చేయూత: వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలవారీ భృతి. విద్య, వైద్యం, ఉద్యోగాలు: 10 లక్షల వరకు ఉచిత వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ,పేద విద్యార్థుల కోసం సమీకృత గురుకులాలు, యువతకు ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ.
ఈ ర్యాలీలో పురపాలక సభ్యులు జాటోతు సురేష్, మెరుగు రాము, తిరుపతి, నీలా లచ్చిరాం, రాములు, కో ఆఫ్షన్ సభ్యులు గుండగాని వెంకన్న, షేక్ అజీజ్, సర్పంచులు పెండ్లి శ్రీనివాస్ రెడ్డి,తొట్టి గౌతమ్, తప్పేట్ల శ్రీనివాస్,సైదులు,రమేష్,అమృనాయక్,కరుణ,మండల అధ్యక్షుడు గుగులోత్ రవి నాయక్,పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్,కే సముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు,జిల్లా సభ్యుడు కుడితి నరసింహ రెడ్డి,తాజోద్దీన్,జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షుడు విజయ్,కొంపెల్లి సురేందర్ రెడ్డి, ఆఫ్జల్, గంధసిరి అంబరీష్, మహ్మద్ అప్సర్,అలువాల ఉపేందర్, గంధసిరి భిక్షపతి, దేవరశెట్టి లక్ష్మినారాయణ,నల్లు శ్రీకాంత్ రెడ్డి, ముదిరెడ్డి బుచ్చి రెడ్డి,గుండగాని వేణు,గంధసిరి సోమన్న, వెర్మరెడ్డి వెంకట్ రెడ్డి, కుడితి వెంకట్ రెడ్డి, బోడ రవి, మహేందర్, చీనా నాయక్, పడిదం రాధిక, యాకుబ్ పాషా, అనంతగిరి శ్రీను, సాయి, బుచ్చిరెడ్డి ,గండి వీరభద్రం, బోడ రమేష్,రఘునందన్ రెడ్డి,సాజీద్, సయ్యద్ సర్వర్ పాషా, కారంపూడి ఉపేందర్, లక్ష్మణ్, కృష్ణమూర్తి, మేకల కృష్ణ, శంకర్, రంజిత్, లింగన్న, వీరన్న, చింతల వెంకన్న, అనంతగిరి రవి, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు…



