కొండా సురేఖను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలి:సాధనాల రాము
డోర్నకల్ ఆగష్టు 05(నమస్తే న్యూస్ )
బీసీ మహిళా మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం అన్యాయమని డోర్నకల్ బిఆర్ఎస్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు సాధనాల రాము అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. అగ్ర నాయకుల ఆధిపత్య పోరులో బీసీ మహిళా మంత్రిపై చర్యలు తీసుకోవడం అవమానకరమని విమర్శించారు.పార్టీలో అంతర్గతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవాలని సూచించారు.కొండా సురేఖ బర్తరఫ్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునరాలోచించి ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ నాయకులను గౌరవించే సంప్రదాయాలను కొనసాగించాలని కోరారు. బీసీ మహిళా మంత్రిపై తీసుకున్న చర్యల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

