భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచిన గ్రామ ప్రజలు..
కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కనకదుర్గమ్మకు పూజలు
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 4
( నమస్తేన్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లోని కాకరవాయి గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ పండుగ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆనవాయితీగా ధర్మకర్తలు లక్కం రాజు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో లక్కం రాజు కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని శాస్త్రక్తంగా బ్రాహ్మణుల చేత అమ్మవారికి పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించి ముక్కులు తీర్చుకుంటారు లక్కం రాజు కుటుంబ సభ్యులు గత 30 సంవత్సరాల నుండి ఇదే ఆనవాయితీగా కొనసాగుతూ గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.అనంతరంపండుగ సందర్భంగా గ్రామంలోని ప్రజలు ఊరు, వాడ తేడా లేకుండా ఏకమై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం ఎడ్ల పండ్లు మరియు ట్రాక్టర్లు ప్రత్యేక అలంకరణలో గుడి చుట్టూ చుట్టూ ప్రభలను తిప్పుతూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం కాకరవాయి గ్రామస్తులకు కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.కాకరవాయి ప్రజలు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కనకదుర్గమ్మను విశ్వసిస్తూ ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.పండుగ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. లక్కం రాజు కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, యువత తదితరులు వేడుకల్లో పాల్గొని పండుగను విజయవంతం చేశారు.


