గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్న కాంగ్రెస్ నాయకుడు
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 4 (నమస్తే న్యూస్ )
కాకరవాయి: గ్రామంలో జరుగుతున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాల్లో గ్రామ కాంగ్రెస్ నాయకులు కట్కూరి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు.ప్రతి సంవత్సరం గ్రామంలో కనకదుర్గమ్మ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ ఉత్సవాలు గ్రామ ప్రజల మధ్య ఐక్యతను, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని శ్రీనివాసరెడ్డి అన్నారు.అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలో ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

