పవన్‌కుమార్ శర్మ డిమాండ్..
గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఆత్మహత్యాయత్నం…అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే న్యూస్):బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్‌ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ పవన్‌కుమార్ శర్మ డిమాండ్ చేశారు.శుక్రవారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఆయన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పవన్‌కుమార్ శర్మ పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టె చేతపట్టుకుని ఆత్మహత్యకు యత్నించగా.. పోలీసులు అప్రమత్తమై ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలచారితో పాటు పలువురు బ్రాహ్మణ సంఘాల నాయకులు గన్‌పార్క్‌కు చేరుకున్నారు. పవన్‌కుమార్ శర్మను నచ్చజెప్పి, ఆయన చేపట్టిన న్యాయపోరాటానికి సంఘీభావం తెలిపారు.అనంతరం పవన్‌కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో దళితులు, పేద బ్రాహ్మణులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. చైర్మన్‌గా పదవి చేపట్టి రెండేళ్లు గడిచినా బ్రాహ్మణుల సంక్షేమానికి ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టలేదని విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని బసవరాజు శ్రీనివాస్‌ను చైర్మన్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని పవన్‌కుమార్ శర్మ కోరారు.ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు గంప రామారావు, రజని, వంశతిలక్, జ్యోతి కులకర్ణి, రాజేశ్వర శర్మ, రాజేశ్వరరావు, రమణ, రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం, జయరాం, దిలీప్‌కుమార్, అన్నదానం సత్యనారాయణమూర్తి, మంగపతిరావు, దుడ్డు సుబ్రహ్మణ్యం, సాయి, మహేశ్ శర్మ, సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.



