మృతుని కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం
రామన్నపేట సెప్టెంబర్ 4(నమస్తే న్యూస్)
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన పోచబోయిన మల్లయ్య అనారోగ్యంతో మరణించారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. అనివార్య కారణాల వల్ల తాను రాలేకపోయినా, మృతుని అంత్యక్రియల నిమిత్తం రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎడ్ల నరేందర్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, పర్నాటి మాధవరెడ్డి, పిట్ట మహేందర్ రెడ్డి, పినికెసి గోపాల్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

