రామన్నపేట సెప్టెంబర్ 4( నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన నాగు కిష్టయ్య తండ్రి బిక్షపతి వయసు 60 సంవత్సరాలు గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతూ ఈనెల 1వ తారీఖున మధ్యాహ్నం సుమారుగా 03 గంటల సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నం చేయగా వెంటనే గుర్తించి కుటుంబ సభ్యులు ప్రధమ చికిత్స నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు అనంతరం మెరుగైన వైద్యం కొరకు కామినేని ఆసుపత్రికి తరలించగా 3/9/2026 గురువారం రాత్రి 8 గంటల 20 నిమిషాలకు చికిత్స పొందుతూ మరణించారు. ఇట్టి విషయంపై రామన్నపేట ఎస్సై సతీష్ గౌహతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.

