తన కార్యాలయంలో పనిచేస్తున్న గణేష్ న్యాయవిద్య అభ్యసించేందుకు సహాయం చేసిన కందాల…
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 4
( నమస్తేన్యూస్ )
సాయిగణేష్ నగర్, ఖమ్మం కందాల క్యాంప్ కార్యాలయంలో గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న రాజారం గ్రామానికి చెందిన గుండాల గణేష్ న్యాయవిధ్యనభ్యసించాలని కోరికతో లాసెట్ ప్రవేశ పరీక్షరాసి అర్హత సాధించకపోవడంతో తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా యాజమాన్య కోటలో ఫీజు కట్టలేని పరిస్థితి తెలుసుకున్న పాలేరు మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గణేష్ న్యాయవిద్య పూర్తిచేసేందుకు మూడు ఏండ్లకు అయ్యే పూర్తి ఖర్చు 3 లక్షల రూపాయలు భరిస్తానని హామీ ఇచ్చారు. మొదటి సంవత్సరం ఫీజు లక్ష రూపాయల డీడిని శుక్రవారం గణేష్ కు అందజేశారు.
ఈ సందర్భంగా గణేష్ వారి కుటుంబ సభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజారం గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగాపురం బాలకృష్ణ గౌడ్, వార్డు మెంబర్ బాణాల వెంకటరెడ్డి రంగాపురం రవి గౌడ్ పాల్గొన్నారు.

