సీఎం రేవంత్రెడ్డి నకిరేకల్ సభలో స్పష్టమైన ప్రకటన చేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్
రామన్నపేట సెప్టెంబర్ 4( నమస్తే న్యూస్ )
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట: రామన్నపేట ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రామన్నపేట ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రికి నూతన భవనం మంజూరి చేస్తున్నట్లు నకిరేకల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి అసెంబ్లీ సమావేశల్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వాసుపత్రి ఎదుట కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.డి. జహంగీర్ మాట్లాడుతూ రామన్నపేట మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ప్రస్తుతం ఆసుపత్రిలో సరిపడా పడకలు, వైద్య సిబ్బంది, అవసరమైన మౌలిక వసతులు లేక, పోవడంతో, శిదిలావస్థకు చేరిన భవనంతో పేద ప్రజలు దూర ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నకిరేకల్ పర్యటనకు వస్తున్న సందర్భంగా రామన్నపేట ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు.ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించవచ్చని అన్నారు.ఇటీవల జిల్లా మంత్రి కోమటిరెడ్డి 6నెలల్లో ఆసుపత్రి పూర్తి చేస్తామని ప్రకటించి రెండు నెలలు కావస్తుందని ఇప్పటికి ఎలాంటి చలనం లేదని అన్నారు.రామన్నపేట ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే వరకు సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఎం.డి. జహంగీర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం,మండల కార్యదర్శివర్గ సభ్యులు కందుల హనుమంతు, కల్లూరి నగేష్,మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్ కుమార్,మండల నాయకులు గొరిగే సోములు,గాదె నరేందర్,నీల అయిలయ్య, తోలుపునూరి శ్రీనివాస్,శాఖ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు శానగొండ రాము, పల్లె సత్యం, బావండ్లపల్లి సత్యం,ఎండీ లతీఫ్,ఆముద ఆంజనేయులు, జల్లెల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

