రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
.
మాటలు తప్ప చేతల్లో కనిపించని పాలనపై ప్రజల ఆగ్రహం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు అంగోత్ విమర్శించారు..కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూమహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు, ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల ముందు హామీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలను మరిచిపోయిందని విమర్శించారు,1000 రోజులు గడిచినా హామీల అమలుపై స్పష్టత లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారుప్రజలకు ఇచ్చిన హామీలను ఇకనైనా వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన మరింత పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని బిందు అంగోత్ హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…


