క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు
రామన్నపేట సెప్టెంబర్ 3(నమస్తే న్యూస్)
మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో గురువారం విద్యార్థులకు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలో హాజరై వేడుకలలో పాల్గొన్నారు. ఉట్లు కొట్టడం, ఆనంద తాండవం నృత్యాల తో అందరినీ ఆకట్టుకునే విధంగా వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఉట్ల ఉత్సవంలో విద్యార్థులు అందరూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి.సురేష్, అకాడమిక్ డైరెక్టర్ జె. మణి, ఉపాద్యాయులు శ్రీనివాస్, మురళి, రషీద్, అలిం, ఉమారాణి , వినోద, పూనం, లావణ్య, ఆసియా, ఫారియా తదితరులు పాల్గొన్నారు.

