మొక్కలు నాటుదాం,నాటిన మొక్కలను రక్షించుకుందాము.
7వ వార్డులో రోడ్డు పనుల పరిశీలన.
జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 02(నమస్తే న్యూస్).
మరిపెడ పట్టణంలోని బస్సు నిలయం ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలను,7వ వార్డులో జరుగుతున్న రహదారి పనులను జిల్లా కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి,పురపాలక అధికారి కంచర్ల నరేష్ రెడ్డి కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక బస్టాండు ఆవరణలో నాటిన మొక్కల ఎదుగుదలను,వాటికి చేస్తున్న నీటి వసతిని పరిశీలించారు.నాటిన ప్రతి మొక్కను కాపాడాలని,పచ్చదనాన్ని పెంచడానికి అందరూ కృషి చేయాలని తెలిపారు.అనంతరం 7వ వార్డులో కొనసాగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు.పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని,ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

వీరి వెంట కాంగ్రెసు నాయకులు కరణ్ సింగ్,మేఘనాధ్,అధికారి పాషా,మణి తదితరులు ఉన్నారు…


