మరిపెడలో కుమ్మర సంఘం మండల కార్యవర్గ సమావేశం.
సమస్యలపై గళమెత్తిన రాష్ట్ర నాయకత్వం.
అలవాల ఉపేందర్ ప్రజాపతి అధ్యక్షతన మండల కేంద్రంలో సమావేశం.
డోర్నకల్/మరిపెడ, సెప్టెంబర్ 02 (నమస్తే న్యూస్):
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని కుమ్మర సంఘం కార్యాలయంలో మంగళవారం మండల కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. మండల అధ్యక్షులు అలువాల ఉపేందర్ ప్రజాపతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు నడికుడి జయంతిరావు సారథ్యంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మరులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.
ప్రధాన డిమాండ్లు:
- కుమ్మర వృత్తిదారులకు ప్రభుత్వం నాణ్యమైన ఆధునిక పరికరాలు అందించి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలి.
- ప్రతి జిల్లా కేంద్రంలో కుమ్మరులకు ప్రత్యేకంగా వర్క్ షాపులు నిర్వహించాలి.
- గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ దేవాలయాల్లో కుమ్మరులను పూజారులుగా అధికారికంగా గుర్తించాలి. వారికి దీప, ధూప, నైవేద్య ఖర్చులతో పాటు నెలకు రూ.10,000 గౌరవ వేతనం చెల్లించాలి.
- కుమ్మర ఫెడరేషన్ ద్వారా రుణ సౌకర్యాలు కల్పించాలి.
- రాష్ట్రంలోని ప్రతి దేవాలయ పాలక మండలిలో కుమ్మరులకు నామినేటెడ్ పోస్టులు కేటాయించాలి.
ఈ సమస్యల సాధన కోసం కుమ్మర్లు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సంఘటితమై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ అలువాల వెంకన్న,మండల ప్రధాన కార్యదర్శి దూకుంట్ల వెంకన్న,కోశాధికారి పాల బిందెల సోమయ్య,గౌరవ సలహాదారు రాచకొండ రామచంద్రయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ కుదురుపాక విష్ణువర్ధన్,ఆలువాల మల్లయ్య,కొయ్యాడ రామయ్య తదితరులు పాల్గొన్నారు.


