రిపోర్టర్: పిల్ల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
రైతుల ప్రయోజనాలపై డీసీవోతో చర్చించిన చైర్మన్, డైరెక్టర్లు..
బయ్యారం సింగిల్ విండో అభివృద్ధికి డీసీవో తోడ్పడుతాం..
మహబూబాబాద్ జిల్లా సహకార అధికారి (DCO) ని బయ్యారం సింగిల్ విండో చైర్మన్ బండారి మల్లయ్య, డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) అభివృద్ధి, రైతులకు మెరుగైన సేవలు అందించడం, సొసైటీ పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై డీసీవో తో చర్చించారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా సహకార సంఘం సేవలను మరింత బలోపేతం చేయాలని చైర్మన్ తెలిపారు. అలాగే డీసీవో కూడా బయ్యారం సింగిల్ విండో అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బయ్యారం సింగిల్ విండో డైరెక్టర్లు కసనబోయిన శ్రీనివాస్, నుద్దునూరి యశోద, బయ్యారం గ్రామ ఉపసర్పంచ్ ఏనుగుల ఉమా రంజిత్, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలేబోయిన వెంకటేశ్వర్లు, దూదిమెట్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

