రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళులు అర్పించడం జరిగింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి దివంగత నేత చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, పేదలకు పండ్లు పంపిన చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బయ్యారం సర్పంచ్ గుగులోత్ శాంతి, కిషన్ నాయక్,బయ్యారం PACS చైర్మన్ బండారు మల్లయ్య పాల్గొన్నారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేలా ఆగిరెడ్డి, కంబాల ముసలయ్య మాట్లాడుతూ…
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి
పేదల సంక్షేమమే పరమావధిగా పాలించిన మహానేత వై.ఎస్.ఆర్.
ఆరోగ్యశ్రీతో పేదలకు ఆరోగ్య భరోసా
ఉచిత విద్యుత్‌తో రైతులకు అండ,పొడుభూములకు పట్టాలు ఇచ్చి పోడు రైతుల మదిలో చిరస్థాయిగా నిలిచి పోయిన మహానేత వైస్సార్ అని
ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థులకు భవిష్యత్ భరోసా
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు
వై.ఎస్.ఆర్
వై.ఎస్.ఆర్. అని భౌతికంగా మన మధ్య లేకపోయినా.ఆయన చేసిన సేవలు, చూపిన మార్గం ఎప్పటికి ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో బయ్యారం సర్పంచ్ గుగులోత్ శాంతి, కిషన్ నాయక్,బయ్యారం pacs ఛైర్మెన్ బండారు మల్లయ్య,PACS డైరక్టర్ నద్దునురి యశోద,వార్డు సభ్యులు, బానోత్ అజయ్,మాజీ ఎంపీపీ కిషన్ నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తగిర సత్యనారాయణ రెడ్డి,, తాటి జనార్ధన్,పంతులు నాయక్, కంకటి నారాయణ, చల్ల కృష్ణ,RC పురం గ్రామశాఖ అధ్యక్షులు దూద్ధిమెట్ల మోహన్ రావు, రెంటల ఇంద్రరెడ్డి, నందగిరి భద్రయ్య, ఆకునూరి సూర్యనారాయణ,నద్దునురి లింగయ్య, ప్రమోద్ రెడ్డి,నందిపాటి బావాణి,బీరెడ్డి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు….

