పెంచిన పెట్రోల్. డీజిల్. వంటగ్యాస్. నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలి.
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 2 ( నమస్తే న్యూస్)
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి.
కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి.
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిన ప్రధానమంత్రి నీ మోడీ.
తిమ్మిడి హనుమంతరావు
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజాపంథా) తిరుమలాయపాలెం మండల కమిటీ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువుల కు పెరుగుతున్న అధిక ధరలకు వ్యతిరేకంగా బుధవారం బచ్చోడు అంబేద్కర్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి గంటసేపు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు తిమ్మిడి హనుమంతరావు మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తే సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తానన్న
నరేంద్ర మోడీ 13 సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని నిరుద్యోగులను ఇంకా నిరుద్యోగులుగనే ఉన్నారని హనుమంతరావు అన్నారు.
మోడీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు అధికంగా పెంచి, సామాన్య,మధ్యతరగతి ప్రజల మీద భారాలు మోపడానికి వ్యతిరేకంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా తిమ్మిడి హనుమంతరావు మాట్లాడుతూ
గోరుచుట్టుపై రోకటి పోటులా ఇప్పటికే ప్రజలు అనేక భారాలతో ఇబ్బందులు పడుతూ ఉంటే,మోడీ ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజలపై నిత్యావసర సరుకుల ధరలను పెట్రోల్. డీజిల్. వంట గ్యాస్. రైల్వే ఛార్జీలను పెంచి సామాన్య మానవులు బ్రతకలేని పరిస్థితికి దిగజార్చాలని ఆయన విమర్శించారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు ప్రయోజనాలను నెరవేర్చడం కోసం పని చేస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి నేరవేర్చకుండా తిరిగి ప్రజల మీద భారాలు వేయటం అవకాశవాదను ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఆయన విమర్శించారు
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా తిరుమలాయపాలెం మండల కార్యదర్శి సోమనపల్లి వెంకటేశ్వర్లు. పాలేరు డివిజన్ నాయకులు ఆరెంపల వెంకన్న. ఎన్నబోయిన శ్రీనివాసరావు. సర్దార్. దారమళ్ళ వెంకన్న. సత్యనారాయణ. గొర్రెపాటి ఉప్పయ్య. జనక బద్రమ్మ. గొర్రెపాటి అనసూర్య. దారమల భద్రమ్మ. గొర్రెపాటి పుల్లయ్య. కూచిపూడి వెంకన్న. తదితరులు
