ప్రభుత్వ పాఠశాలలో ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఆకస్మిక తనిఖీ
విద్యార్థుల బోధనా విధానాన్ని పరిశీలించిన ఏసీఎం రాములు
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
బయ్యారం, సెప్టెంబర్ 3 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని మెట్లతిమ్మాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారి ఏసీఎం రాములు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు అందిస్తున్న బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. బోర్డుపై రాసిన పాఠ్యాంశాలను విద్యార్థులతో స్వయంగా చదివించి వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడిన ఏసీఎం రాములు.. పాఠాలను శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే పాఠశాల విద్యే పునాది అని పేర్కొన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని, కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని తెలిపారు.
విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాలలో విద్యా ప్రమాణాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజనం పరిశీలన
పాఠశాల వంటగదిని కూడా ఏసీఎం రాములు పరిశీలించారు. వంటగదిలోని కూరగాయలు, ఇతర సామగ్రిని పరిశీలించి మధ్యాహ్న భోజనం నాణ్యతను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్పీఎస్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

