హలావత్ మనూరియా పార్థివ దేహానికి నివాళులర్పించిన
సర్పంచ్ నునావత్ సమ్మక్క అశోక్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 2 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలం లోని కాంగ్రెస్ సీనియర్ నేత హలావత్ మనూరియా అనారోగ్యంతో బుధవారం మృతి చెందడంతో మృతి వార్త తెలుసుకున్న సర్పంచ్ నునావత్ సమ్మక్క అశోక్, మాజీ సర్పంచ్ లు హలావత్ శ్రీనివాస్, ఎర్ర నాగుల కేశ్య, పంది అంజయ్య షేక్ జాన్ పాషా, పీక్ల, దేవేందర్ కోటయ్య,లు మనూరియా పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మనూరియా కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు
మనసున్న మహారాజు నునావత్ సమ్మక్క అశోక్
సోలిపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మంగ్య తండ పీక్య తండా హలవత్ తండా గ్రామాల్లో నిరుపేదలు చనిపోతే అట్టి కుటుంబానికి గ్రామ సర్పంచ్ నునావత్ సమ్మక్క అశోక్, తమ సొంత ఖర్చులతో చనిపోయిన ప్రతి కుటుంబానికి 2000 రూపాయలు చొప్పున నేటికీ 30 మందికి ఆర్థిక సహాయం అందించడంతో గ్రామంలోని ప్రజలందరూ వారిని ప్రశంసిస్తున్నారు

