ఘనంగా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ,వర్ధంతి వేడుకలు
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 2 (నమస్తే న్యూస్ )
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పీడిత జననేత పేద ప్రజల ఆశాజ్యోతి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ, వర్ధంతి వేడుకలను తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ మాట్లాడుతూ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ , ఉప సర్పంచ్ బుర్ర శ్రీనివాస్, ధరావత్ నరసింహారావు,దారావత్ సంతోష్, మాజీ సర్పంచ్ నల్లబెల్లి లింగయ్య, మాజీ ఎంపీటీసీ గోళ్ళ లింగయ్య,ఉండేటి ధర్మరాజు తూమాటి హాజరయ్య, బోడ సుదర్శన్ ,ఉండేటి ప్రకాష్, వల్లోజు నాగరాజు, నాయి బ్రాహ్మణ మండల అధ్యక్షులు ఆలేటి రాములు,, వెయిలాలు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

